ప్రకాశం: మార్కాపురం డివిజన్ డీఎస్పీగా నిమ్మగడ్డ సత్యనారాయణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ నాగరాజు పదవీకాలం ముగియడంతో పదవి విరమణ చేశారు. ఆయన స్థానంలో నిమ్మకడ్డ సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచి నేరాల నియంత్రణకు కృషి చేస్తామని డీఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ


