హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముసునూరులో అత్యధిక వర్షపాతం నమోదు

ఏలూరు జిల్లాలో శనివారం ఉదయం 7 గంటల నాటికి ముసునూరులో అత్యధికంగా 41.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. బుట్టాయగూడెంలో 17.8 మి.మీ., పోలవరం, నూజివీడులలో 1.2 మి.మీ. చొప్పున వర్షం కురిసింది. జంగారెడ్డిగూడెంతో సహా మిగిలిన 24 మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదు. జిల్లా సగటు వర్షపాతం 2.2 మి.మీ.గా ఉంది.