హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నవరం సన్నిధిలో రాష్ట్ర హైకోర్టు జడ్జి పూజలు

కాకినాడ: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సందర్శించారు. ఆలయ EO చక్రధరరావు ఆధ్వర్యంలో అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. సత్యదేవుని ప్రత్యేక దర్శనం చేయించి, వేద పండితులతో ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ వైశిష్ట్యాన్ని న్యాయమూర్తికి వివరించిన అధికారులు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.