హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తిరుమలకు రాపిడో, ఓలా నో ఎంట్రీ!

TPT: భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల ఘాట్‌రోడ్‌లో రాపిడో, ఓలా, ఉబర్ బైక్ రైడర్లను అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. ఇటీవల మొదటి ఘాట్‌రోడ్డులోని 26వ మలుపు వద్ద రాపిడో బైక్ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, ప్రయాణికుడు తీవ్రంగా గాయపడిన ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలిపిరి తనిఖీ కేంద్రంలో 'నాట్ ఎలౌడ్' పోస్టర్లు ఏర్పాటు చేసి నిఘా పెట్టాలని సిబ్బంది కోరింది.