హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక పుష్పాలంకరణలో 'పెళ్లిళ్ల వెంకన్న'

కోనసీమ: అమలాపురం పట్టణ మహిపాల వీధిలో వేంచేసి ఉన్న పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. స్వామివారు ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అన్నప్రసాద ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.