నిజామాబాద్ గ్రామీణ మండలం కొండూరు గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రహదారులపై గుంపుగా తిరుగుతూ.. పాదచారులు, ద్విచక్ర వాహనదారులను వెంబడిస్తూ దాడికి పాల్పడుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, పాఠశాలలకు వెళ్లే పిల్లలు వీటి నుంచి తప్పించు కోలేక తీవ్ర గాయాలపాలవుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
వీధి కుక్కలు స్వైరవిహారం


