హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

MLG: కన్నాయిగూడెం మండలం గంగగూడెం సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పేరూరు గ్రామానికి చెందిన రమేష్ (48) మృతి చెందారు. బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మూలమలుపు వద్ద అదుపుతప్పి గుంతలో పడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతదేహాన్ని ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు.