హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు వావిళ్ళ పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికలు

నెల్లూరు: విడవలూరు మండలంలోని వావిళ్ళ జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో ఒకటవ తేదీ నిర్వహించిన ఎస్ఎంసీ ఎన్నికల్లో కోరం లేక ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ ఎన్నికలను తిరిగి శనివారం నిర్వహిస్తున్నట్లు పాఠశాల హెచ్ఎం చెంచురామయ్య ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ హాజరు కావాలని సూచించారు.