JN: రఘునాథ్‌పల్లి మండలం అశ్వరావుపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని ప్యారాల కావ్యశ్రీ జాతీయస్థాయి సబ్‌జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైంది. మెదక్ జిల్లా బీహెచ్‌ఈఎల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికైనట్లు హెచ్‌ఎం శోభన్‌బాబు, పీఈటీ రాజేందర్ శుక్రవారం తెలిపారు. విద్యార్థిని పలువురు అభినందించారు.
తెలంగాణ
జాతీయ బాల్ బ్యాడ్మింటన్‌కు కావ్యశ్రీ


