హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూద స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. 14 మంది అరెస్ట్

HYD: యాకుత్‌పురలోని ఐఎస్ సదన్ చౌరస్తా సమీపంలో జూద స్థావరంపై చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఇంట్లో కార్డ్స్ ఆడుతున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.07 లక్షల నగదు, 14 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై తదుపరి చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.