హైదరాబాద్: 28°C
తెలంగాణ

కౌటాలలో విషాదం.. బాలిక మృతి

ASF: కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన శ్రీలత (15) పురుగుల మందు తాగి మృతి చెందినట్లు సీఐ సంతోష్‌కుమార్ తెలిపారు. శ్రీలత స్థానిక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ చికిత్స పొందినా నయం కాలేదు. శుక్రవారం పురుగుల మందు తాగగా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.