హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు

PDPL: గోదావరిఖని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రామగుండం, కరీంనగర్ ఎక్సైజ్ పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. అల్లూరు, రాజీవ్‌నగర్ తండా, కేకేనగర్ ప్రాంతాల్లో 150 లీటర్ల బెల్లంపానకాన్ని ధ్వంసం చేశారు. గోదావరిఖని కళ్యాణ్‌నగర్‌లో 6.44 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, ఐదుగురిపై కేసులు నమోదు చేశారు.