హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైలవరంలో నేటి నుంచి శనగ విత్తనాల నమోదు

KDP: మైలవరం మండల రైతులకు శనగ విత్తనాల నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుందని AO గురుభాస్కర్ తెలిపారు. APSSDCL ద్వారా క్వింటాకు రూ.5,850 చొప్పున విత్తనాలు సరఫరా చేస్తామన్నారు. 0.50 ఎకరాకు ఒక బ్యాగు నుంచి గరిష్ఠంగా 5 ఎకరాలకు 10 బ్యాగులు (20 కిలోలు చొప్పున) అందిస్తామని పేర్కొన్నారు. రైతులు ఆధార్, పాస్‌బుక్ జిరాక్స్, ఫోన్ నంబర్ తీసుకురావాలని సూచించారు.