NRML: కుంటాల మండలం కల్లూరు గ్రామంలోని ఓ రైస్ మిల్లులో రెవెన్యూ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. రికార్డుల ప్రకారం 4,440 టన్నుల ధాన్యం ఉండాల్సి ఉండగా.. 720 టన్నులు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దీంతో 3,720 టన్నుల ధాన్యం కొరత తేలింది. మిల్లును, లారీలోని ధాన్యాన్ని అధికారులు సీజ్ చేశారు. మిల్లర్ అందుబాటులో లేరని తెలిపారు.
తెలంగాణ
ధాన్యం నిల్వల్లో వ్యత్యాసం.. మిల్లు సీజ్


