హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ గ్యాస్ సిలిండర్ల పట్టివేత

BHNG : చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచి బ్లాక్‌లో విక్రయిస్తున్న జబ్బారం గుజర్ (25)ను చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం హెడ్ కానిస్టేబుల్ సైదయ్య బృందం జరిపిన తనిఖీల్లో టాటా ఏస్ వాహనంతో పాటు 12 పెద్ద సిలిండర్లు, 2 ఖాళీ చిన్న సిలిండర్లు, ఒక రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.