హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉచిత హోమియో వైద్య శిబిరం

కృష్ణా: గుడివాడ మండలం సత్యనారాయణపురంలోని సాయి ఉషోదయ పాఠశాలలో శనివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురురాజు హోమియో ఆసుపత్రి వైద్యులు సేవలు అందిస్తారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నపూర్ణదేవి, అనీల్ కుమార్, తదితరులు కోరారు.