హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు తపాలాపూర్‌లో విద్యుత్ సరఫరా అంతరాయం

MNCL: జన్నారం మండలంలోని తపాలాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. సబ్ స్టేషన్‌కు వచ్చే 33KV లైనుకు తగిలే కొమ్మలు తొలగించుట, మరమ్మతుల కారణంతో శనివారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు తాళ్లపేట, రోటిగూడ, తపాలాపూర్, రాంపూర్ ఫీడర్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వారు అన్నారు.