MHBD: వ్యవసాయ బావిలో మోటారు వెలికితీస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో చిక్కుకుని బొల్క శ్రీధర్ (37) మృతి చెందాడు. మహబూబాబాద్ మండలం రేకులతండాకు చెందిన గుగులోత్ జనార్దన్ మోటారు తీసేందుకు శ్రీధర్‌ను తీసుకురాగా శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు నీటిని తోడి మృతదేహాన్ని వెలికితీశారు. తల్లి దేవమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి. రాజు తెలిపారు.
తెలంగాణ
బావిలో పడి ఒకరి మృతి


