హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఆలయ హుండీ లెక్కింపు

కృష్ణా: కంకిపాడు మండల కేంద్రమైన కంకిపాడు గ్రామంలోని శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం, శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో శనివారం హుండీ కానుకల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సీహెచ్.వీఎస్. సుబ్రహ్మణ్యం తెలిపారు. ఉదయం 10 గంటలకు శివాలయంలో, 11.30 గంటలకు విష్ణాలయంలో లెక్కింపు జరుగుతుందన్నారు. ఔత్సాహికులైన గ్రామస్థులు పాల్గొనవచ్చునన్నారు.