WGL: ఖానాపురం మండలం పాకాల సరస్సు సమీపంలోని వాగులో పడి యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. గీసుకొండ మండలం మచ్చాపూర్‌కు చెందిన బిల్లా సునీల్ (39) స్నేహితులతో కలిసి పాకాలకు విహారయాత్రకు వచ్చారు. ఈత కొట్టేందుకు వాగులో దిగగా లోతైన ప్రాంతంలో మునిగి గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
విహారయాత్రకు వచ్చి.. యువకుడి మృతి


