హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్, కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు: మాజీ మంత్రి

KNR: కరీంనగర్‌లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో శుక్రవారం మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సిరిసిల్లలో జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల కోసం ప్రకటించిన అంబేడ్కర్ అభయహస్తం పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.