W.G: గాంధీ జయంతి సందర్భంగా భీమవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పాలకోడేరు గ్రామంలో అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 27 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ బసంతి తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై ఉమామేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్


