హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 6న కాణిపాకంలో హుండీ లెక్కింపు

CTR: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఈనెల 6న హుండీ లెక్కింపు జరగనున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఆలయ ఆస్థాన మండపంలో ఉదయం 7 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది విధిగా హుండీ లెక్కింపులో పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు.