హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తాళ్ల రాంపూర్ వీడీసీపై చర్యలు తీసుకోవాలి'

NZB: తాళ్లరాంపూర్ వీడీసీపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మోపాల్, NZB రూరల్ మండల గౌడ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలో గౌడ కులస్తులు, గీత కార్మికులపై వీడీసీల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. ప్రభుత్వం గౌడ కులస్తులకు కేటాయించిన లైసెన్సుల ద్వారా గీత వృత్తి చేస్తూ జీవనం కొనసాగిస్తుంటే వారిపై వీడీసీలు దాడులు చేయడం సరైంది కాదన్నారు.