సిద్దిపేట జిల్లాలో నూనెగింజల సాగును ప్రోత్సహించేందుకు జాతీయ నూనెగింజల మిషన్ కింద పొద్దుతిరుగుడు విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి తెలిపారు. చిన్నకోడూరు, గజ్వేల్, బెజ్జంకి, తొగుట, సిద్దిపేట రూరల్ తదితర ప్రాంతాల్లో 3,000 ఎకరాల సాగు లక్ష్యంగా రైతు వేదికల ద్వారా ఉచితంగా విత్తనాలు అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
తెలంగాణ
3 వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగు లక్ష్యం


