హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్..!

KMM: ఏన్కూర్ పరిధిలోని తిమ్మరావుపేటలో డబ్బులు పందెంగా పెట్టి జూదం ఆడుతున్న పేకాట స్థావరంపై శుక్రవారం సాయంత్రం ఏసీపీ వసుంధర యాదవ్ ఆదేశాల మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో ఏడుగురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ. 4,870 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, పేకా ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇలాంటి కార్యకమాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ACP వెల్లడించారు.