హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ

NLR: ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని రాజంపేట సర్పంచి శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం సాయంత్రం GP ఆవరణంలో 16 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు సకాలంలో ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకోవాలన్నారు. లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం రూ.5 లక్షలు జమ చేస్తోందని గుర్తు చేశారు.