VSP: అగనంపూడి ప్రాంతీయ ఆసుపత్రిలో ఇవాళ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు దాసరి త్రినాథరావు తెలిపారు. సేవా సంకల్ప్ సేవా అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. పలు రకాల వ్యాధులకు వైద్య నిపుణులు చికిత్స అందించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత వైద్య శిబిరం


