హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ గుట్కా తయారీ కేంద్రం గుట్టురట్టు

HYD: ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటి మస్జిద్, మురాద్నగర్ వద్ద ఉన్న 'AAA బాడ్షా గుట్కా' అక్రమ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సుమారు రూ. 50 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేంద్రం యజమానులు జుబేర్, ముజఫర్ (దాదా) పరారీలో ఉండగా, ఇద్దరు కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.