హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆపదలో ఉన్నవారికి రక్తం అందించడమే లక్ష్యం: MP

MDK: సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ బీజేపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ రఘునందన్‌రావు ప్రారంభించి మాట్లాడారు. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం గొప్ప సేవ అని, బీజేపీ కార్యకర్తలు ఎల్లప్పుడూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్ గౌడ్ పాల్గొన్నారు.