హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలికలు, మహిళల రక్షణే ధ్యేయం: ఎస్సై

ASR: బాలికలు, మహిళల రక్షణ కోసం పటిష్ఠమైన చట్టాలపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలని సీలేరు ఎస్సై యాసిన్ సూచించారు. గత రాత్రి స్థానిక రామాలయం వీధిలో ప్రజలతో సమావేశం నిర్వహించి, 'ఆపరేషన్ త్రిశూల్'‌పై అవగాహన కల్పించారు. ముఖ్యంగా బాలికలకు గుడ్, బ్యాడ్ టచ్‌పై స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని మహిళలను కోరారు.