NZB: డిచ్ పల్లిలోని బర్దిపూర్ చెరువులో ఓ వృద్ధుడి శవం లభ్యమైంది. ఎస్సై ఆరిఫ్ వివరాల ప్రకారం బర్దిపూర్‌కు చెందిన జాజున గంగాధర్(60) గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతని కుమారుడు ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం బర్దిపూర్ చెరువులో వృద్ధుడి శవం లభ్యమైంది.
తెలంగాణ
చెరువులో వృద్ధుడి శవం లభ్యం


