KMM: తిరుమలాయపాలెం స్థానిక ఎస్సీ, గిరిజన గురుకుల వసతి గృహాలను శుక్రవారం ఎంపీడీవో షేక్ సిలార్ సాహెబ్, సర్పంచ్ సుజాతతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల భోజనాన్ని పరిశీలించిన ఆయన, మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. విద్యార్థుల భద్రతపై నిరంతరం నిఘా కొనసాగుతుందని వెల్లడించారు.
తెలంగాణ
గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించాలి: MPDO


