హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీనీ తోటల కోసం మంత్రి కీలక చొరవ

సత్యసాయి: ధర్మవరంలో సాగునీటి కొరతతో చీనీ, ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినకుండా మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవ తీసుకున్నారు. ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌ను కోరారు. సొంతంగా ట్యాంకర్లు ఏర్పాటు చేసుకునే రైతులకు ఒక్కో ట్యాంకర్‌కు రూ.800 చెల్లించేలా చర్యలు తీసుకోనున్నారు. 2,3 రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు.