హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమంగా పెట్రోల్ తరలింపు.. వ్యాన్ సీజ్ చేసిన అధికారులు

తూ.గో: కొవ్వూరు మండలం పంగిడి హైవేపై భారత్ పెట్రోలియం (BPCL)కు చెందిన ట్యాంకర్ నుంచి మరో మినీ వ్యాన్లోకి పెట్రోల్ తరలిస్తున్న వాహనాన్ని పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. ట్యాంకర్‌ను సీజ్ చేసినట్లు సహాయ పౌరసరఫరాల అధికారి నాగాంజనేయులు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం జేసీకి నివేదిక పంపనున్నట్లు ఆయన తెలిపారు.