కాకినాడ: గాంధీ జయంతి సందర్భంగా మద్యం, మాంసం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే జిల్లాలోని చాలా ప్రాంతాల్లో యధావిధిగా అమ్మకాలు సాగించడం గమనార్హం. మద్యం సైతం బ్లాక్‌లో ఇష్టారీతిన అమ్మకాలు జరిగాయనే విమర్శలున్నాయి. అధికారులు చర్యలు చేపట్టకపోవటంతో ప్రభుత్వ ఆదేశాలు క్షేత్ర స్థాయిలో అమలు కాలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో విచ్చలవిడిగా మద్యం, మాంసం విక్రయాలు


