హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్

MLG: ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1,100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. నిందితులు జగదీష్, రామ్‌చరణ్ తేజ్, ఆకుల వంశీ, వరప్రసాద్‌లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని, చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.