హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీ జయంతినేస్ఫూర్తిగా.. 53సార్లు రక్తదానంతో రికార్డు

SRCL: 25 ఏళ్లుగా 53 సార్లు రక్తదానం చేసి ఎల్లారెడ్డిపేటకు చెందిన వంగ గిరిధర్ రెడ్డి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గాంధీ జయంతి రోజున తొలి రక్తదానం చేసి సేవా ప్రయాణం ప్రారంభించారు. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేట బ్లడ్ సెంటర్‌లో 53వ సారి రక్తదానం చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సహా పలుచోట్ల రక్తదానం చేసి అవగాహన కల్పిస్తున్నారు.