హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

11 నుంచి భైరవకోనలో నవరాత్రి ఉత్సవాలు

NLR: సీతారామపురం మండలంలోని ప్రముఖ క్షేత్రమైన భైరవకోన శ్రీ భైరవేశ్వర దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలను అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ట్రస్టు బోర్డు ఛైర్మన్ శ్యామ సుందర రాజు, ఈవో వంశీకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలన్నారు.