ATP: దివ్యాంగుల స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. శింగనమలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులకు రిట్రోఫిటెడ్ త్రిచక్ర వాహనాలను ఆమె లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గానికి రూ.1.20 లక్షల విలువైన 10 త్రిచక్ర వాహనాలు మంజూరయ్యాయని, మొత్తం రూ.12 లక్షల విలువైన వీటిని ఉచితంగా అందజేశామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శింగనమలలో దివ్యాంగులకు త్రిచక్ర వాహనాల పంపిణీ


