హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొవ్వూరులో వీధి కుక్కల నివారణకు ప్రత్యేక చర్యలు

E.G: కొవ్వూరు పట్టణంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని ఫిర్యాదులు వస్తున్నాయని ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ సందీప్ తెలిపారు. కుక్కలను పట్టుకునే చర్యలు చేపడుతున్న సమయంలో జంతు సంరక్షణ స్వచ్ఛంద సంస్థల నుంచి అభ్యంతరాలు, కేసులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.