హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నందిగామలో బిర్యానీ విక్రయాలు..!

VIDEO: నందిగామలో నిబంధనలకు విరుద్ధంగా బిర్యానీ విక్రయాలు జరిగాయి. చందాపురం దర్గా వద్ద చైతన్య ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాన్యం, మాంసం దుకాణాలు బంద్ అయినప్పటికీ, బిర్యానీ అమ్మకాలు నిర్వహించింది. అధికారుల హెచ్చరికలను లెక్కచేయకుండా ఈ చర్యకు పాల్పడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. నిఘా పెంచినట్లు తెలిపారు.