హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సబ్ జైలులో ‘ఖైదీల సంక్షేమ దినోత్సవం

కృష్ణా: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నందిగామ సబ్ జైలు ప్రాంగణంలో ఖైదీల సంక్షేమ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సమావేశంలో న్యాయవాదులు, అధికారులు మాట్లాడుతూ.. ఖైదీలు గతాన్ని విడిచిపెట్టి, సత్ప్రవర్తనను అలవర్చుకుని సమాజంలో మంచి పౌరులుగా తిరిగి జీవించాలని పిలుపునిచ్చారు. జైలు జీవితం తర్వాత సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగాలని సూచించారు.