హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటో డ్రైవర్లకు ఆపరేషన్ త్రిశూల్‌పై అవగాహన

ASR: డుంబ్రిగుడ మండలం అరకు వారపు సంతలో శుక్రవారం ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా ఆటో డ్రైవర్లకు పోలీసులు అవగాహన కల్పించారు. ఎస్పీ ఆదేశాలతో నిర్వహించిన కార్యక్రమంలో మహిళల రక్షణ, రోడ్డు భద్రత, గంజాయి నివారణపై వివరించారు. నిబంధనలు పాటిస్తూ ప్రజల భద్రతకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో అరకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు, ఎస్సై ఎల్.సురేష్ పాల్గొన్నారు.