హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నంతో విడదీయరాని బంధం..!

కృష్ణా: మహాత్మా గాంధీకి మచిలీపట్నంతో ప్రత్యేక అనుబంధం ఉంది. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా గాంధీజీ బందరు పట్టణాన్ని పలుమార్లు సందర్శించి ప్రజల్లో చైతన్యం నింపారు. 1921 మార్చిలో ఆంధ్ర జాతీయ కళాశాలలో రెండు రోజులు బస చేశారు. 1929 ఏప్రిల్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య నివాసంలో బస చేసి, గ్రంథాలయం, కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు.