AKP: రాంబిల్లి మండలం, వెంకయ్యపాలెం తీరంలో అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను తరలిస్తుండటంతో తీర ప్రాంత స్వరూపం దెబ్బతిని పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాంబిల్లి తీరంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు


