అనకాపల్లిలో శుక్రవారం జరిగిన స్వచ్ఛ ఆంధ్ర సభలో హోం మంత్రి అనిత, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. విశేష సేవలందించిన 67 మంది స్వచ్ఛ వారియర్స్‌కు పురస్కారాలు అందజేశారు. సైనికుల్లా సమాజ ఆరోగ్యం కోసం పారిశుధ్య కార్మికులు శ్రమిస్తున్నారని కొణతాల కొనియాడారు. స్వర్ణాంధ్ర సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛ ఆంధ్ర సభలో హోం మంత్రి


