హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్య వివాహాల నివారణ కార్యక్రమం

NTR: వత్సవాయి గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గ్రామసభ జరిగింది. ఎంపీడీవో బి. రాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో బాల్య వివాహాల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. విక్షిత్ భారత్ జి రామ్ జి పథకం, ఉపాధి హామీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ సూపర్వైజర్, ఏపీవో, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.