హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి'

PLD: నరసరావుపేటలో APUWJ ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డే నిర్వహించారు. జర్నలిస్టుల భద్రత, ఇళ్ల స్థలాలు, రైల్వే పాసుల పునరుద్ధరణతో పాటు ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ RDO కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో APUWJ జిల్లా, నరసరావుపేట యూనియన్ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.