హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా స్థాయి స్వచ్ఛత అవార్డులు..!

ELR: జిల్లా స్థాయిలో నిర్వహించిన స్వచ్ఛత పోటీల్లో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి మూడు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ కె. వెట్రిసెల్వి చేతుల మీదుగా అధికారులు ఈ పురస్కారాలను అందుకున్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, తడి-పొడి చెత్త సేకరణ సమర్థవంతంగా చేపట్టినందుకు ఈ గుర్తింపు లభించిందన్నారు.